Saturday, December 28, 2013

ఈ మధ్య నేను చూసిన సినిమా




హాయి మిత్రులార,

              నేను ఈ మధ్య ఒక చిత్రానికి వెళ్ళాను పేరు ధూం 3. మా ఇంటి దగ్గర ఆడుతుంది. బాగుంది చిత్రం. పాత రెండు సిరీస్ తో పొలుస్తే కొంచం వేరేలాగ ఉంది. ముందుగా సినిమా హాల్ గురించి మాట్లాడాలంటే అది ఒక ధాన్యపు గొడౌన్లో ఒక తెర కట్టి అక్కడక్కక దొరికిన కుర్చీలు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాని ధ్వని, బొమ్మ, ఏ.సి బానే ఉంటాయి. అదృష్టం ఏమిటంటే ఆ హాల్లో నల్లులు, దోమలు మొదలగు కీటకములు ఏమి లేవు. ఏందుకంటే ఈ మధ్య నేను ఒక పేరున్న హాల్లో ఈ ప్రొబ్లెం చవి చూసా. ఆ హాల్ల్తో పొల్చుకుంటే నాకు మా హాలే బెస్ట్ అనిపించింది.

               ఇక చిత్రవిషయానికి వస్తే చిత్రం బాగుంది. ఉన్న పాత్రలన్నీ వాళ్ళ కోసమే అన్నట్టున్నాయి. కొంచేం పెద్ద చిత్రం ఐనప్పట్టికి చూడదగ్గ చిత్రం. ఇక పాత్రల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవలసిన పాత్ర ఆమిర్ ఖాన్ తన కోసమే ఆ పాత్ర అన్నట్టు సరిగ్గా సరిపొయాడు. ఆ పత్రలో వెరే వాళ్ళని ఊహించుకోలేము కూడా. తన అభినయంతో అందరిని కదలకుండా చేసాడు. ఇక కత్రినా కైఫ్ కూడ చాల బాగుంది (అందం, అభినయం) పాత సినిమాలకన్నా ఈ సినిమా కొసం చాలా కష్టబడింది. ఇక అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా పాత్రల్లో పెద్ద ఏమి తేడాలేదు. కాని ఆమిర్ ఖన్ ముందు వాళ్ళు తేలిపొయారు. కొన్ని సన్నివేషాలు మన పాత సినిమా సన్నివేషాల్లా అనిపించాయి నాకు.

               సినిమా తీసిన ప్రదేశాలు, పొరాటాలు చాలా బాగున్నాయి. పాత సీరీస్ లో పాటలు, పొరటాలు, చేజింగ్లు బాగున్నాయి. ఈ చిత్రం లో పాటలు నాకు ఇతే పెద్ద ఏమి అనిపించలేదు. ఇక పొరాటాలు, చేజింగ్లు బానే ఉన్నాయి. పైగా ఊహించని మలుపులు ఉన్నాయి (2-3) అంతే. ఇక మిగతా విభాగాలు కూడ వాటివంతుగా కష్టపడ్డాయి అనే చెప్పాలి.       

పొసిటివ్ : ఆమిర్ ఖాన్, కత్రిన కైఫ్, ప్రదేశాలు, పొరాటాలు 
నెగెటివ్ : పాత వాటితో పోలిస్తే చిత్రం అంతా నెగెటివ్ గానే ఉంటుంది.      

మొత్తoమ్మీద చిత్రం బానే ఉంది. కుటుంబ సమేతంగా తప్పక చూడ దగ్గ చిత్రం.

                            ధన్యవాదములు,
                                                                                                          ఇట్లు,
                                                                                                           మీ మిత్రుడు.

 .