ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన ఒక యదార్ధ సంఘటన.నేను పి.జి చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన.అది మేము ఎంసిఏ ఐదవ సెమిస్టర్ పరీక్షలకి తప్పక,మనసొప్పక,వేరే దారి లేక పుస్తకాలతో కుస్తీపడుతున్నాం.మేము ఎక్కువగా రాత్రి మాట్లు చదువుతూ ఉంటాము అలా దెయ్యాలు తిరిగే వేళ వరుకు చదివి వాటికి సుభోదయం చెప్పి నిద్రకు ఉపక్రమిస్తాము.ఇది రోజూ మా దినచర్యలో ఒక భాగమే.ఇక చదువు విషయానికి వస్తే సెమిస్టర్ మొదటిలో చాలా అనందంగా గదిపేసి ఇంకొక నెలలో పరీక్షలు మొదలవుతాయి అనగా కాలేజి మానేసి పుస్తకాలలో తలకాయలు దూర్చేసేవాళ్ళం.నేను అక్కడ రూములో ఉండేవాడిని.
ఇక రూము విషయానికి వస్తే అది ఒక పొర్షన్ అనగా ఒక పెద్ద హాలు దాని వెనకాల ఒక చిన్న వంటగది.నా రూము లో మొత్తము ముగ్గురము ఉండేవాళ్ళం(నాతో కలిపి).నేను,అమర్,శ్రీను(అన్న) ఇవి మా పేర్లు.ఎప్పటిలాగే మేము రాత్రి తొమ్మిది గంటలకు భోజనము ముగించి చదువుకి ఉపక్రమించాం.నేను వెనక గదిలో గాలి ఎంత్రము పెట్టుకొని చదువుకుంటున్నాను.మిగతా ఇద్దరు ముందు గదిలో కూర్చుని చదువుకుంటున్నారు గాలి ఎంత్రము క్రింద.నేను మధ్యలో ఉన్న తలుపు దగ్గరకు వేసి చాలా ఏకాగ్రత తో చదువుతున్నాను అట్లాగే వాళ్ళు కూడ.మేము పరీక్షల సమయములో చాలా సీరియస్ వాళ్ళెవరో నేనెవరో అన్నట్టు గా ఉండేది వ్యవహారం.ఇలా వేడిగా సాగిపొతుంది మా వ్యవహారం పైగా దసరా వచ్చేస్తుంది.ఆ పండగ దాటిన రెండు రోజులకు మా పరీక్షలు మొదలు.
దసరా వచ్చిందంటే మాకందరికీ పండగే.మా ఊరిలో దసరా బాగా చేస్తారు ఎందుకంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వెలసినది ఆ ఊరిలోనే కాబట్టి. హడావిడి అంతా రాత్రిపూటే మేము చదివేది కూడ ఆ సమయములోనే కావున ఇంకా తొందరగా చదివేయాలి.పైగా శీతాకాలం ఒకటి మొదలవుతూ ఉంటుంది.చదువు మధ్యలో ఇలా సాగిపోతున్న నా ఆలోచనల నడుమ సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు నాకు సమీపముగా ఘల్.. ఘల్.. ఘాల్.. మని గజ్జల చప్పుడు అది విని నా గుండెల్లో భయం అసలే బైట కోద్దిగా చలి పైగా గదిలో గాలిఎంత్రం ఈ పరిణామాలతో నా దేహము యొక్క ఉష్నొగ్రత ఒక్క సారిగా పడిపొయింది ముఖములో నేత్తుటి చుక్క లేదు.ఎందుకంటే అక్కడ గజ్జలు పెట్టుకొని ఆ సమయములో తిరిగేవాళ్ళు ఏవరూ ఉండరు.
నేను చదువుతున్న గది మొత్తం ఒక్క సారిగా చల్లబడిపోయినది.మేము అద్దేకుండే ఇంటికి ఆనుకొని ఇంకొక ఇల్లు ఉంటుంది .అది మా ఇంటికి వెనకాల వస్తుంది ఏట్లాగంటే మా వంటగది మరియు ఆ మేదమీదికి వెళ్ళుటకు మెట్లు చాల దగ్గరగా ఉంటాయి.నేను చదువుతున్న వాడినల్లా ఒక్క సారిగా అటు వైపు చూసి ఉల్లిక్కిపడ్డాను.ఆ మెట్ల మీద ఏవరో కూర్చుని నా వైపే చూస్తున్నట్లు అనిపించి వెంటనే అన్నీ వదిలేసి ముందు గదిలోకి నేమ్మదిగా పిల్లిలా వచ్చి దుప్పటి ముసుకు పెట్టేసాను.ఇది చూసినా మిగతా ఇద్దరికి విషయం అర్ధం కాలేదు.చల్ల కొచ్చి ముంత దాయడం ఎందుకులే అని నేనే వాళ్ళకు విషయం మొత్తం వివరించాను.అంతే దెబ్బకు వాళ్ళు కూడ పుస్తకాలు వదిలేసి దుప్పట్లో దూరిపోయారు.నాకు విషయం అర్ధం కాలేదు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో అని నేమ్మదిగా విషయం లాగితే నాకు కూడ భయం రేట్టింపయింది.
కారణం వాళ్ళు కూడ నాలాగే ముందు గదిలో తలుపులు దగ్గరికి వేసుకొని చదువుకుంటున్నారు.సరిగ్గా నాకు ఈ సంఘటన జరిగిన సమయానికే ముందు గదిలో వాళ్ళకు కూడ ఇలాంటి సంఘటనే జరిగింది.వాళ్ళు చాలా ఏకాగ్రతతో చదువుతూ ఉండగా నేమ్మదిగా తలుపు తెరచుకుంది.దాంట్లోంచి చిన్ని కాలు ఒకటి గదిలోకి వచ్చింది తరువాత ఇంకో కాలు లోపలికి వచ్చింది.ఏంటా అని చూస్తే పిల్లి.కాని అది అచ్చం పులిలాగుందంట.వాళ్ళు అప్పుడు భయపడలేదు నేను నా అనుభవం చెప్పేసరికి భయం రెట్టింపయింది.ఆ దెబ్బకి లైట్లు కూడ ఆర్పకుండా పడుకుండిపొయాను నేను.కాని మా అన్న ధైర్యంగా వెళ్ళి లైట్లు ఆర్పి వచ్చాడు(నిజం చెప్పాలంటే వాడికి చచ్చేంత భయం).మా రూము తూర్పువైపుకు ఉంటుంది.దానికి అటు వైపు మరియు దక్షిణం వైపు పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి.మా రూము పక్కన అగాధం లాగ చాలా క్రిందికి ఉంటుంది అక్కడ కూడ ఇళ్ళు ఉంటాయనుకోండి.
ఇక ఆ దెబ్బకి పెట్టిన ముసుగు మరునాడు ఉదయభానుడు వచ్చేవరకు ఏవరు తీయలేదు.ఈ విషయం మిగతా స్నేహితులకి చెపితే వాళ్ళు మమ్మల్ని చూసి చాలా ఎటకారంగా మట్లాడుకున్నారు.ఆ దెబ్బకి ఒక రోజు చదువు అటకెక్కింది.సర్లే గదా అని మరుసటి రోజు రాత్రి మొదలు పెట్టాము చదువు.ఈ సారి అందరము ఒకే చోట కూర్చుని.కాని ఎవరికీ ఏకాగ్రత కుదరడంలేదు అంతగా భయపడిపోయాము.మేము ఇలా భయపడి చస్తుంటే మిగతా స్నేహితులంతా ఒక ప్రణాళిక ప్రకారం మా భయం పొగొట్టాలని కంకణం కట్టుకున్నారు.అది ఏలాగో తదుపరి బ్లాగులో తెలుపబడును........
Thursday, November 01, 2007
Subscribe to:
Posts (Atom)