Friday, March 20, 2009

కాలేజి రోజులు .........



ఇవి నేను కాలేజిలో చదువుకునేటప్పటి చేదు,తీపి జ్ఞాపకాలు. ఉగాది పచ్చడి లాగే మా(అందరి) కాలేజి జీవితంలో కూడా అన్ని రుచులు ఉన్నాయి(ఉంటాయి). మా కాలేజి పేరు ఎస్.వి.కె.పి & డాక్టర్.కె.ఎస్ రాజు అర్ట్స్ & సైన్స్ కాలేజి. ఈ కాలేజి ఆంధ్ర విశ్వవిద్యాలయం అధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా లోని పెనుగొండ అను మండలములో కలదు.మాలో చాలా మంది ఊళ్ళోనే ఉండేవాళ్ళం. కొంత మంది తణుకు,పాలకొల్లు మరియు ఆ పరిసర గ్రామాల నుంచి వచ్చేవారు. మా బ్యాచ్ మొత్తం 18 మంది, అందులో ఊళ్ళో ఉండేవారు 11 మంది. నేను, వర్మ, గిరి ఒక రూం, (సురేష్,శశి(బాబు),రాజశేఖర్,సురేష్(పెంటియం)) వీళ్ళు నలుగురు ఒక రూం,(అమర్,శ్రీను(అన్న),విఘ్నేష్, శశి కుమార్) ఒక రూం.ఇలా మొత్తం మూడు రూములలో ఉండేవాళ్ళం.ఇదంతా ఊళ్ళో ఉండే బ్యాచ్. ఇక పాలకొల్లు విషయానికి వస్తే వాళ్ళ లీడర్ గంగాధర్ ఊరు నర్సాపురం, సభ్యులు(మోహన్, నాగిరెడ్డి, సతీష్, ప్రదీప్, నాగేశ్వరరావ్). వాళ్ళతో పాటు ఒక అమ్మయి కూడా వచ్చేది. వాళ్ళు రోజూ మా కన్నా ముందే వచ్చేవారు ఒక్కరు తప్ప. మా క్లాస్ స్ట్రెంగ్త్ మొత్తం నలభై ఏనిమిది మంది అందులో పదకొండు మంది అమ్మాయిలు మిగతావారు అబ్బాయిలు. ఇంకొక బ్యాచ్ తణుకు నుంచి వచ్చేది అందులో (కొండలు,ఆనంద్,విశ్వనాథ్). వాళ్ళతో పాటు ముగ్గురు అమ్మయిలు కూడా వచ్చేవారు. ఇది అంత ముఖ్యమైన బ్యాచ్ కాదు ఒక్క అమ్మాయి తప్ప. ఆ అమ్మాయి మాత్రం చాలా ముఖ్యమైనది.



ఆబ్బాయిలలో మళ్ళా నాలుగు బ్యాచ్లు. మాది, హాస్టల్ ది, వెరైటి బ్యాచ్, ఆఖరిది సోది బ్యాచ్. వీళ్ళకి ఏవరితోటి సంభందం ఉండదు. అందరికంటే మాదే పెద్ద బ్యాచ్.జాయిన్ ఐన కొత్తల్లో అంతా కలిసే ఉండేవాళ్ళం అందరిలాగే మేము కూడా మా జూనియర్స్ వచ్చాకా బ్యాచ్ల కింద విడిపొయాము. కాని విడిపోయి సాదించినది ఏమి లేదు.




ఇక మా బ్యాచ్ విషయానికి వస్తే ఒక్కొకళ్ళకి ఒక్కొక్క కధ. ఎవరికి తోచిన అమ్మయిని వాళ్ళు ట్రై చేసే వారు. ఇక్కడ తోచిన కన్నా నచ్చిన అంటే కొంచం బాగుంటుంది. అంతా వన్ సైడే చివరివరకు. ఏమి చేస్తాం వాళ్ళ దురదృష్టం.అమ్మాయిలలో కూడా రెండు బ్యాచ్లు ఉండేవి ఒకటి హాస్టల్ బ్యాచ్ ఇంకొకటి బైటి బ్యాచ్. ఇదేంటి సడన్ గా హాస్టల్ ఏంటా అని ఆలోచిస్తున్నారా మా కేంపస్ లో ఒక మూల లేడీస్ హాస్టల్ ఉంటుంది అలాగే ప్రభుత్వ్య హాస్టల్ కూడా ఉంటుంది బోయ్స్ కి, వాళ్ళు అంతా సెపరేట్ బ్యాచ్. మా కాలేజికి లేడీస్ హాస్టల్ ఉంది లేండి .ఇక విషయానికి వస్తే మా క్లాస్ మొత్తం మీద కొన్ని జంటలు ఏర్పడ్డాయి ప్రత్యక్షము గా కాని పరోక్షము గా కాని. ఆగండాగండి మీరు వేరే వుద్దేసాల్లోకి వెళ్ళిపోకండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మా బ్యాచ్ లో కొంత మంది పుణ్యమా అని కొంతమంది జీవితాలు మారిపొయాయి. ఆన్ని వన్ సైడ్ స్టొరిలే కాలేజి రోజులు ఇపొయే సరికి అవి చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగి తిరిగి ఆగి పొయాయి. కాని ఇంకా కొన్ని కొనసాగుతున్నాయనుకోండి అది వెరే విషయం.


ఆమ్మాయి అడిగితే కాదనే అబ్బాయిలు ఉండరని తెలుసు కాని, మా వాళ్ళని చూసాక అది నిజమని తెలిసింది.ఏమిటో వెధవ జీవితం.వీళ్ళు ఏప్పటికి మారతారో లేక అసలు మారరో!!!





Share

Thursday, January 15, 2009

మన సంక్రాంతి !!!!!!!!!

ముందుగా బ్లాగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి క్రొత్త సంవతరంలో వచ్చే మొదటి పండగ, మన తెలుగు వాళ్ళందరికి చాలా పెద్ద పండగ మరియు ముఖ్యమైన పండగ. ఎందుకంటే మన చేలోని ధాన్యం కోత కొయ్యబడి రాసులు గా మన ఇంటికి చేరాక వచ్చే పండగ. అందుకే మన తెలుగు వారందరికి ఇది చాలా ముఖ్య పండగ. ఇది ఒక్క రోజు పండగ కాదు మూడు రోజుల పండగ.

ఈ పండగ మొదటిరోజు ఇంటిల్లిపాది తెల్లవారుజామునే లేచి భొగి మంటల ముందు కూర్చుని ఆ వెచ్చని మంటల వేడిని కాచుకుంటూ ఆ మంట మీద పరవాణ్ణం పెట్టి అది దేవుడికి నైవేధ్యం కింద సమర్పించి తరువాత దానిని ఆరగిస్తరు. తరువాత కమ్మని పిండి వంటలు చేసుకొని విందు ఆరగిస్తారు. సంక్రాంతి అంటే మనకు బాగా గుర్తు వచ్చేది కొత్త అళ్ళుళ్ళ రాకలు, బావా మరదళ్ళ సరదాలు మరియు ముఖ్యంగా చెప్పుకోవలసింది కొడి పందాలు.ఇక్కడ చెప్పుకోవలసినది ఇంకొకటి వుంది ముగ్గుల లోగిళ్ళు. ఆడవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు వాకిలిని రకరకాల ముగ్గులతో, వాటి మధ్యలో చిన్న చిన్న గొబ్బెమ్మలతో అలంకరించేవారు.పల్లెటూళ్ళలో ఇతే పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి వాటికి రకరకాల రంగులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి అలంకరించేవారు. అది చూడటానికి చాలా ముచ్చటగా ఉండేది.


ఇక్కడ చెప్పుకోవలసినది ఇంకొకటి ఉంది అదే హరి దాసు మరియు గంగిరెద్దు. పండగ మొదటి రోజు ఉదయాన్నే హరిదాసు చిడతలతో రోజు మొదలవుతుంది. కాని ఇప్పుడు అవేమి కనబడడం లేదు కారణం గ్లోబలైజేసన్. దీని పుణ్యమా అని అందరూ పట్టణాలకి వలస రావడంవల్ల పల్లేటూళ్ళు ఖాళి ఇయిపొయి కనీసం పండగలకు కూడ మన సొంత గ్రామము వెళ్ళే తీరిక కూడ లేకుండా పొయింది. ఒక వేళ వెళ్ళాలనుకున్నా రకరకాల ఇబ్బందులు అందులో కొన్ని మచ్చుతునకలు :


1) టికెట్స్ ఏక్కువ ధరకి అమ్మడం.



2) కార్యాలయములో సెలవు దొరకకపొవడం.



3) ప్రణాలిక లేకపొవడం.



4) అన్నీ ఉన్నా వెళ్ళడం ఇష్టం లేక పొవడం.


కాని ఇప్పుడిప్పుడే మనలో మార్పు వస్తుంది సంక్రాంతి వచ్చిందంటే చాలా మంది ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి, ఈ కాలుష్యం నుంచి బైట పడాలని చూస్తున్నారు. మన చిన్నప్పుడు సంక్రాంతి వచ్చిందంటే పండగే ఏందుకంటే ఆ పండుగకే భంధుగణమంతా కలిసేది. కాని ఇప్పుడు ఎవరు కలవడం లేదు ఎవరికి వారు ఉన్నత విద్యలని, ఉద్యోగాలని విదేశాలకు వెల్లిపోతున్నారు. వెళ్ళిన వారు రావడానికి కనీసం నాలుగైదు సంవత్సరములు పడుతుంది. ఇలా మనం జీవితంలో ఎదగడానికి పడే తాపత్రయంలో మనం ఏమి కోల్పోతున్నామో తెలియడం లేదు. ఇది మన ధౌర్భాగ్యం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే సెలవు కోసం చూస్తున్నాం అంతే!!!!!!


ఇక రెండవ రోజుకి వస్తే అదే అసలు పండగ పైగా పెద్ద పండగ దాన్నే మకర సంక్రాంతి అని అంటారు. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానము చేసి గుడికి వెళ్ళి ఏమైనా పిండి వంటలు చేసుకొని విందు ఆరగించి అలా సర్దాగా చేలలో తిరిగితిరిగి కోడి పందాల దగ్గరకి వెళ్ళి ఇంటికి వచ్చి ఆ అలసటకు నిద్రలోకి జారుకుంటారు.ఆ రోజు అంతా కోడి పందాలదే హవా.

ఇక మూడవ రోజు అదే చివరి రోజు దాన్నే కనుమ అంటారు.ఆ రోజు పెద్దగా విషయం లేకపొయినా హాడావిడి మాత్రం ఏ మాత్రం తగ్గదు. కాని చివరి రోజు కావడం వల్ల ఎవరికి వారు ప్రయాణానికి సిద్దం కావలసిందే. వచ్చేటప్పుడు ఏంత సంతోషంగా వస్తామో వెళ్ళేటప్పుడు అంత బాధగా వెళ్తాము.


మళ్ళా మొదలు ఉరుకులు పరుగుల నగర జీవనం.....

బ్లాగు పాఠకులకి సంక్రాంతి శుభాకాంక్షలు ......











యదార్ధ సంఘటణ తరువాయి భాగం!!!

మా రూం కి నలువైపుల నడవడానికి చిన్న సందు ఉంటుంది. మేము ఉండే ఇల్లు ఆ సందులో చివరిది ఇక ముందుకు వెళ్ళడానికి దారి ఉండదు పైగా కొంచెం చీకటిగా ఉంటుంది సందు మొదట్లో ఒక దీపం మాత్రమే ఉంటుంది. మా మిగతా స్నెహితులంతా (4) ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళ ఇంటి యజమాని దగ్గర గజ్జలు తీసుకొని రాత్రి సమయములో మా రూంకి రావాలని వాళ్ళ ప్లాన్. మా వీధి చివరకి వచ్చేటప్పటికి మేము చదివే ఉద్దేసము లేక సరదాగ బైటికి వెళ్దామని రడి ఇయ్యి బైటికి వచ్చేసరికి వాళ్ళు(3) వీధి చివర దీపపు వెలుగులో కనిపించారు. సరే కదా అని మేము మా కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వాళ్ళతో పాటు తిరిగి రూంకి వెల్లిపొయాము. వాళ్ళు నలుగురు వచ్చారని మాకు తెలియదు మేము ముగ్గురే అని అనుకున్నాము.


మిగిలిన ఇంకొకతను తన దగ్గర ఉన్న గజ్జతో మా ఇంటి లోకి ప్రవేశించి మా రూం చుట్టూ ఆ గజ్జెతో ఘల్.. ఘల్.. ఘల్.. ఘల్.. మంటూ మా రూం కిటికీ దగ్గర ఒక సారి ప్రధాన ద్వారం దగ్గర ఒకసారి ఇలా నాలుగైదు సార్లు వచ్చేటప్పటికి మాకు భయము వేసి మిగతా వాళ్ళాని అడిగితే వాళ్ళు మాకు ఏమి వినబడలేదే అని చెప్పారు. సరే కదా అని చాల సేపు ఓపిక పట్టాము. కాని ఆ టెన్సన్ భరించలేక పొతున్నాము ఈ లోపు ఆ శబ్ధము ఒక చోటు నుంచే రావడం మొదలు పెట్టింది.ఇక మేము ఓపిక పట్టలేక ఎదో ఒకటి అవుతుందిలే అని అందరము కలిసి మా అన్నని ముందుకి తోసాము. మా అన్న ఏంతో ధైర్యముతో తలుపు తీసేసరికి బైట ఉన్న మా వాడు ఘబాలున మా మీదకి దూకే సరికి ఆ టెన్సన్లో మా అన్న కిందకి పడిపొయాడు నేను ఒక్క ఉదుటున వెనక్కి వెళ్ళి తెల్ల మొహం వేసి అలా బొమ్మలా కొయ్యబారిపొయను.


మా రూంలో ఉండే ముగ్గురి మొహంలో నెత్తుటి చుక్క లేదు కాసేపటికి బైట నుంచి వచ్చినవాడు మరియు రూంలో ఉన్న మిగతా వారు ఒకటే నవ్వులు నాకు ఒక్క పావుగంట వరకు ఏమి జరుగుతుందో అసలు అర్ధమే కాలేదు. అంతలా భయపడ్డాను #####


నా విధ్యార్ది జీవితంలో అదొక భయంకర అనుభవం అది తలచుకున్నప్పుడల్లా ఒకటే నవ్వులు !!!!!!!!!