ఈ పండగ మొదటిరోజు ఇంటిల్లిపాది తెల్లవారుజామునే లేచి భొగి మంటల ముందు కూర్చుని ఆ వెచ్చని మంటల వేడిని కాచుకుంటూ ఆ మంట మీద పరవాణ్ణం పెట్టి అది దేవుడికి నైవేధ్యం కింద సమర్పించి తరువాత దానిని ఆరగిస్తరు. తరువాత కమ్మని పిండి వంటలు చేసుకొని విందు ఆరగిస్తారు. సంక్రాంతి అంటే మనకు బాగా గుర్తు వచ్చేది కొత్త అళ్ళుళ్ళ రాకలు, బావా మరదళ్ళ సరదాలు మరియు ముఖ్యంగా చెప్పుకోవలసింది కొడి పందాలు.ఇక్కడ చెప్పుకోవలసినది ఇంకొకటి వుంది ముగ్గుల లోగిళ్ళు. ఆడవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు వాకిలిని రకరకాల ముగ్గులతో, వాటి మధ్యలో చిన్న చిన్న గొబ్బెమ్మలతో అలంకరించేవారు.పల్లెటూళ్ళలో ఇతే పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి వాటికి రకరకాల రంగులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి అలంకరించేవారు. అది చూడటానికి చాలా ముచ్చటగా ఉండేది.
ఇక్కడ చెప్పుకోవలసినది ఇంకొకటి ఉంది అదే హరి దాసు మరియు గంగిరెద్దు. పండగ మొదటి రోజు ఉదయాన్నే హరిదాసు చిడతలతో రోజు మొదలవుతుంది. కాని ఇప్పుడు అవేమి కనబడడం లేదు కారణం గ్లోబలైజేసన్. దీని పుణ్యమా అని అందరూ పట్టణాలకి వలస రావడంవల్ల పల్లేటూళ్ళు ఖాళి ఇయిపొయి కనీసం పండగలకు కూడ మన సొంత గ్రామము వెళ్ళే తీరిక కూడ లేకుండా పొయింది. ఒక వేళ వెళ్ళాలనుకున్నా రకరకాల ఇబ్బందులు అందులో కొన్ని మచ్చుతునకలు :
1) టికెట్స్ ఏక్కువ ధరకి అమ్మడం.
2) కార్యాలయములో సెలవు దొరకకపొవడం.
3) ప్రణాలిక లేకపొవడం.
4) అన్నీ ఉన్నా వెళ్ళడం ఇష్టం లేక పొవడం.
కాని ఇప్పుడిప్పుడే మనలో మార్పు వస్తుంది సంక్రాంతి వచ్చిందంటే చాలా మంది ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి, ఈ కాలుష్యం నుంచి బైట పడాలని చూస్తున్నారు. మన చిన్నప్పుడు సంక్రాంతి వచ్చిందంటే పండగే ఏందుకంటే ఆ పండుగకే భంధుగణమంతా కలిసేది. కాని ఇప్పుడు ఎవరు కలవడం లేదు ఎవరికి వారు ఉన్నత విద్యలని, ఉద్యోగాలని విదేశాలకు వెల్లిపోతున్నారు. వెళ్ళిన వారు రావడానికి కనీసం నాలుగైదు సంవత్సరములు పడుతుంది. ఇలా మనం జీవితంలో ఎదగడానికి పడే తాపత్రయంలో మనం ఏమి కోల్పోతున్నామో తెలియడం లేదు. ఇది మన ధౌర్భాగ్యం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే సెలవు కోసం చూస్తున్నాం అంతే!!!!!!
ఇక రెండవ రోజుకి వస్తే అదే అసలు పండగ పైగా పెద్ద పండగ దాన్నే మకర సంక్రాంతి అని అంటారు. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానము చేసి గుడికి వెళ్ళి ఏమైనా పిండి వంటలు చేసుకొని విందు ఆరగించి అలా సర్దాగా చేలలో తిరిగితిరిగి కోడి పందాల దగ్గరకి వెళ్ళి ఇంటికి వచ్చి ఆ అలసటకు నిద్రలోకి జారుకుంటారు.ఆ రోజు అంతా కోడి పందాలదే హవా.
ఇక మూడవ రోజు అదే చివరి రోజు దాన్నే కనుమ అంటారు.ఆ రోజు పెద్దగా విషయం లేకపొయినా హాడావిడి మాత్రం ఏ మాత్రం తగ్గదు. కాని చివరి రోజు కావడం వల్ల ఎవరికి వారు ప్రయాణానికి సిద్దం కావలసిందే. వచ్చేటప్పుడు ఏంత సంతోషంగా వస్తామో వెళ్ళేటప్పుడు అంత బాధగా వెళ్తాము.
మళ్ళా మొదలు ఉరుకులు పరుగుల నగర జీవనం.....