Friday, October 05, 2007

ఎర్ర బస్సు ప్రయాణం ..............

ముందు పోస్టుకి ఇది కొనసాగింపు ….…………….

ఇక ప్రయాణ విషయానికి వస్తే ఆ పల్లెటూరు నుంచి ఆ దగ్గర లొని నగరానికి ఎర్ర బస్సు ఉంటుంది. ఆ బస్సు మీద (ఈ బస్సు మనందరిది చేయి ఎత్తినచోట ఆపబడును) అనే కేప్షఞ్ ఉంటుంది.ఆ గ్రామానికి వెళ్ళలంటే అది ఎక్కి వెళ్ళవలసిందే.అది కూడ గంటకు ఒకటొ లేక రెండో.ఇది ఒకప్పటి మాట. కాని ఇప్పుడు బోలేడు ఆటోలు వచ్చేసాయనుకోండి.ఆ బస్సు మనల్ని ఎప్పుడు తీసుకెల్తుందొ ఆ బస్సు డ్రైవెర్కి కూడ తేలీదు అసలు వెల్తుందొ లేదో కూడ తేలీదు ఎందుకంటే ఏక్కడ పడితే అక్కడ ఆపుకుంటూ జనాల్ని ఎక్కించుకుంటూ పోతుంది. నీవు ఎక్క వలసిన బండి జీవిత కాలం లేటు అంటే ఎమిటొ అప్పుడర్థమవుతుంది.


ఇక రోడ్డు విషయనికి వస్తే సన్నని చిన్న బక్కపలచని రోడ్డు మధ్యమధ్యలో ఎత్తు పల్లాలతో మన ప్రయానం సాగి పొతునప్పుడు ఆ రోడ్డు పరిస్థితి చూసి మనం ప్రభుత్వ్యాన్ని తిట్టుకుంటూ దానిని గెలిపించినందుకు మనల్నిమనం తిట్టుకుంటూ చివరికి ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు అని అనుకొని పక్క వారితొ పిచ్చాపాటి మాటలతో అలా సాగిపొతున్న ప్రయానంలొ మధ్యమధ్యలొ అమ్మలక్కల పిచ్చపాటి మాటలతో చివరికి ఏన్నొ వ్యయప్రయాసలతొ మన గమ్యస్థానం చేరుకుంటం.


అక్కడ బస్సు దిగంగానే అరుగు మీద కొంతమంది పనిపాటలేని వాళ్ళు,కాలక్షేపం కొసం కూర్చునే పెద్ద వాళ్ళు మనల్ని చూసి ఏరా ఎవరి తాలుక అని వాళ్ళ ఎదురుకుండా ఎర్ర బస్సు దిగినా సరే ఎప్పుడు వచ్చావు అని మనల్ని నానా తంటాలు పెట్టి చివరికి మన దగ్గరనుంచి విషయం రాబడతారు.రేడిఒ మిర్చి 98.3 ఫ్ ఎం కన్నా ఫాస్టు గా మనం వచ్చిన సంగతి ఊరు జనాలకి తెలిసిపొతుంది.ఇక ఆ ఊరిలొ తిరుగుతుంటే కనబడిన ప్రతీవారు “ఏర ఇదేనా రావడం, ఎప్పుడొచ్చావు” వంటి వగైరా వగైరా ప్రశ్నలతో మనల్ని అడుగుతుంటారు.కానీ వారు ఎంతో ఆప్యాయంగా మనల్ని పలకరిస్తుంటే మనం వాళ్ళని తిట్టుకుంటాం. ఎందుకంటే వళ్ళు మనల్ని తెలిసి అడుగుతున్నరో లేక తెలియక అడుగుతున్నరో మనకి తెలియక.కాని అలాంటి ఆప్యాయత ఇక్కడ దొరకదు.


అలా అలా ఆ రొజు గడిచిపొతుంది. ఇక సుబ్బరంగా స్వచ్చమైన పెరుగు వేసుకుని భొజనం చెసి ప్రయాణ బడలికతొ ఆరుబైట విశ్రమిస్థాం. మనల్ని లేపకముందే ఆ ఉదయభానుడు తన కిరణాలతో మనల్ని నిద్రలేపుతూ ఉంటే మనం ఆ భానుడ్ని తిట్టుకుంటూ వేరే దారి లేక నిద్ర లేస్తం.సర్లే గదా అని లొపల పడుకుంటే మన కరెంటు వాడిని వాళ్ళ ఆవిడ కొట్టినప్పుడో లేక తిట్టినప్పుడో వాడికి చిర్రెత్తుకొచ్చి నప్పుడో అది వస్తూ పోతూ ఉంటుంది.అప్పుడు మనం ఎందుకొచ్చామురా భగవంతుడా అని మనల్ని మనం తిట్టుకొని అలా మంచం మీద దొర్లుతూ మధ్య మధ్య లో దోమల సంగీతం వింటూ ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని అనుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తాం.

ఇంకా ఉంది వచ్చేవారం చదవండి...............

4 comments:

Unknown said...

ఇక ఎర్ర బస్సులు లెవు కదండీ...
ఇప్పుడు అన్నీ 'పల్లెవెలుగు'లె ...

Srikanth said...

చాలా బాగుంది కాని next time post చేసేటప్పుడు తప్పులుసరిచేసుకోండి అప్పుడు ఇంకాబాగుంటుంది,next week నాకు తెలిసి ఆహారపలవాట్లు, దాని గురించి ఉంటుందనుకుంటున్నాను.

నా కథలు...... said...

అలాగే శ్రీకాంత్ గారు తప్పులు సరి చూసుకుంటాను.

నా కథలు...... said...

అశ్విన్ గారు మీరు చెప్పింది కరక్టు ఇప్పుడన్నీ పల్లె వెలుగులే.