Tuesday, June 26, 2012

నా వివాహ జీవితం

నా వైఫ్ పేరు దివ్య. వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా లోని రామచంద్రాపురం. చదివింది ఎం సి ఏ అది ఇక్కడే (హైదరాబాద్) కాని పక్క పల్లెటూరి అమ్మాయి. చూడడానికి చాలా అమాయకంగా ఉంటుంది కాని తెలివయింది, తను వంటలు బాగా చేస్తుంది ముఖ్యంగా నాన్ వెజ్ బాగా చేస్తుంది. ఇంట్లో అన్ని పనులు తనే చలాకిగా చక్కపెడుతుంది.

నాకు పెళ్ళి అయ్యి అప్పుడే రెండు సంవత్సరాలు అయిపొయినందుకు చాలా బాధగా ఉంది అంతలా గడిచిపొతున్నాయి రోజులు. మేము అయిపొయిన రెండు సంవత్సరాలలో ప్రతి రోజు ఏదో ఒక క్రొత్తదనం ఉండేది. అప్పుడప్పుడు సరదాగా చిన్న చిన్న అలకలు. చెప్పడం మరిచా తనకి కోపం కూడా ఏక్కువే. మేము అలాగే ఒక ట్రిప్ కూడా వేసాం.

మా పెళ్ళి అయిన మొదటి సంవత్సరం సందర్భంగా మేము చాలా ప్రదేశాలు సందర్సించాం. అందులో ముఖ్యంగా మేము మర్చిపొలేని ప్రదేశం కూర్గ్. మేము ఆ ట్రిప్ ని చాలా బాగా ఎంజోయ్ చేసాము. ఆ ట్రిప్ మాకు ఏన్నో మధురానుభూతులు మిగిల్చింది. ఇప్ప్పటివరకు మా వివాహ జీవితం ఏంతో మధురముగా గడిచింది.

మరిన్ని వివరాలతో తిరిగి మీ ముందుకు వస్తా.....

6 comments:

చెప్పాలంటే...... said...

eppudu elaane baavundandi...happy married life

ప్రేరణ... said...

అలా హాయిగా సాగనివ్వండి...

పరిమళం said...

మరేంటనుకున్నారు....తూర్పుగోదావరి అమ్మాయిల్నిచేసుకోవాలంటే బోల్డు పుణ్యంచేసుకోవాలిమరి :) :)

sarma said...

నేనూ పరిమళం గారి మాట బలపరుస్తున్నానోచ్!

మాలా కుమార్ said...

చాలా సంతోషం . మీ వివాహ జీవితం ఇలాగే అనందంగా సాగిపోవాలి . ఆల్ ద బెస్ట్ .

నా కథలు...... said...

మీ అందరి కమెంట్స్ కి ధన్యవాదములు