Wednesday, October 03, 2007

మన పల్లెటూళ్ళు .......

ప్రియమైన ప్రేక్షకులకి ఇది నా రెండొవ బ్లాగు ఏమైన తప్పులుంటే మన్నించండి ఎవరినైన నొప్పిస్తే క్షమించండి.

అది ఒక అందమైన జిల్లా.ఆ జిల్లలో ఒక ప్రముఖ పున్యక్షేత్రం కలదు.దానికి దగ్గరలో ఒక అందమైన పల్లెటూరు.అది ఒక మారు మూల కుగ్రమం. ఆ పల్లెటూరికి ఇరువైపుల పచ్చని పొలాలు ఆ పొలం గట్లకిరువైపుల పచ్చని కొబ్బరి చెట్లు ఆ పొలాల మధ్య నల్ల త్రాచులాంటి ఒక సన్నని రోడ్డు ఆ పల్లెటూరిని దగ్గరలొను పెద్ద రోడ్డుని కలుపుతూ పొతుంది.పళ్ళెటూళ్ళే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు.అలాంటి పల్లెటూరులు ఇప్పుడు జనం లేక వెలవెలబోతున్నాయి.
పల్లెటూర్లంటే ప్రకృతి అందాల భాండగారలు.ఉదయాన్నే భానుడు తన కిరనాలను పచ్చని పంటపొలల పై ప్రకాసింపచెస్తునప్పుడు ఆ పొలాలపై మంచు తెరలాగ పరుచుకుని ఏక్కడో కొడి కొక్కొరకో అని అరుస్తుంటె ఆ అనుభవం వర్ననాతీతం.సంధ్యవేళ పక్షుల కిలకిలరవాలమధ్య భానుడు వీడ్కొలు చెప్పుతూ చందమామకు స్వాగతం తెలుపుతున్నప్పుడు ఆ ప్రకృతి దృశ్యాలు వర్ననాతీతం.ఇలాంటి దృశ్యాలను మనము కోల్పోతున్నామనే బాధ ఎవరికి గుర్తుకురావటంలేదు వచ్చినా ఏమి చేయలేని పరిస్థితి.అక్కడ అంత కల్మషం లేని గాలి, మనుషులు ఎంతో ఆహ్లదకరమైన వాతావరణం.

అలంటి వతవరణాన్ని వదిలేసి నేడు గ్లొబలైశేట్ ఞ్ పున్యమని మన అందరం అలాంటి ప్రశాంతమైన వాతవరనాన్ని వదిలేసి ఈ కాంక్రిటు జంగిల్లొ పడిపొయాం ఎటు చూసిన జనం ఒకటె సబ్ధ,గాలి కలుష్యం ఇనా సరే అలాగే బ్రతికేస్తున్నాం.అలాంటి అందమైన పల్లెటూళ్ళను వదెలేసి నందుకు బాధ పడాలో లేక ఇలంటి రణగొణ ధ్వనుల మధ్య అగ్గిపెట్టలాంటి ఇంటిలొ బోలెడు అద్ది ఇచ్చి ఉంటున్నందుకు గర్వపడాలొ అర్ధంకావడంలేదు.

పల్లెటూరిలొ సొంత పాలు సొంత కూరగాయలు లంకంత కొంప పెద్ద దొడ్డి అన్నీ వదెలేసి ఇక్కడ అగ్గి పెట్టె లాంటి ఇళ్ళలొ బ్రతికెస్తున్నట్టి నా లంటి బ్రతుకూజీవులెందరో ఉన్నారు.కాని ఏమి చేయలేని పరిస్థితి కారనం ఇక్కడ మంచి ఉదొగ్యం పిల్లల భవిష్యత్తు చాల బాగుంటాయి అనే ఒక్క కారనం తప్ప ఇంకేమి లేదు.ఈ మధ్య సగం పల్లెటూర్లు కాళి ఇపొయాయి.కారనం అందరు పట్టనాలకు వలస పోతున్నారు.

అందమైన ప్రకృతి పచ్చని పంట పొలలను వదిలేసి కాలుష్యపు కోర్రల్లోకి పోతున్న ఈ జనులందరికి నా తొ సహ ఇదే నా ఆవేదన.ఇక్కడ అలవాటు పదిపొయి అక్కడికి వెళ్ళాలంటె చాలా ఇబ్బంది పడిపోతారు కొంత మంది అందులో నేను ఒక్కడిని.మరి కొంత మంది వెళ్ళాలనుకున్న వెళ్ళలేని పరిస్థితి దానికి సవాలక్ష కారనాలు చెబుతారు.ఇక్కడంతా యాంత్రిక జీవనం మధ్య బ్రతికేస్తు మనం ఏమి కోల్పోతున్నమో మనకి అర్ధం కావడం లేదు.ఇదివరకు సగటు మనిషి జీవిత కాలం నూరు సంవత్సరములు కాని అది క్రమీన తగ్గి నేడు అరవయ్కి చేరింది కారణం కాలుష్యం పైగా కుట్రలు కుతంత్రాలు నిండిన మనుషుల చుట్టూ బ్రతుకుతున్న అభాగ్యజీవులెందరో ఎప్పుదు ఏ ఆపద వస్తుందో తెలీదు ఇనా సరే బ్రతికేస్తున్నం .

6 comments:

విశ్వనాధ్ said...

రాసిన దాంట్లో విషయం బావుంది.
పల్లెలల్లో అందాలు కావాలనుకొంటే
ఏసీ గాలులు వదిలేయాలి, ఐ మాక్స్ సినిమాలు వదిలేయాలి,
అధునాతన అలంకరణ వదిలేయాలి,వీటితో పాటు-
పల్లెల్లో కరెంతు కోతను భరించాలి.
వర్షంలో బురద మట్టి భరించాలి.
దోమల,ఈగల మోత భరించాలి.
ఇకా చాలా చాలా భరించాల్సుంటుంది.

అందంగా రాసేందుకు ప్రయత్నించారు.
అక్షరదోషాలు పరిశీలించిన తరువాత పోస్ట్ చెయ్యండి.

నా కథలు...... said...

సరే ఈ సారి రాసినప్పుడు సరిచూసుకుంటాను

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

విశ్వనాథ్ గారూ,
పట్నాలలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి.
- ట్రాఫిక్ బాధలు భరించాలి
- బాంబుల, మత కల్లోలాల భయంతో ప్రతీ క్షణం బతకాలి
- వర్షం వస్తే కొట్టుకుపోయే రోడ్లమీదా, కూలిపోయే ఫ్లైఓవర్ల మీద ప్రయాణించాలి.
- సొంత వాహనం లేకపోతే సిటీ బస్సుల్లో వేలాడుతూ గుండెలు చెత్తో పట్టుకొనో, లేక ఆటో వాడీ దోపిడీకి గురవుతూనో బతకాలి
- ఈ బిజీలో సంసారజీవితాన్ని కూడా త్యాగం చేస్తూ, ఆత్మవంచన చేసుకొంటూ బతకాలి

ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో..

Venky said...

పల్లెటూరిని అక్కడి అందాల్ని అంతే అందంగా చాలా బాగా వర్ణించారు. 11 సంవత్సరాల క్రితం మా ఊరిని మొదటిసారి వదిలి వచ్చేసిన నాకు ఈ పోస్టు చదువుతూ ఉంటే, చిన్నప్పుడు మేము ఆడుకున్న తోటలు, తిరిగిన పొలాలు .. ఆ మధురమైన అనుభూతులన్నీ మరోసారి గుర్తుకు వచ్చాయి. థాంక్యూ :-). 'ఆ పల్లెటూరికి ఇరువైపుల పచ్చని పొలాలు ఆ పొలం గట్లకిరువైపుల పచ్చని కొబ్బరి చెట్లు ఆ పొలాల మధ్య నల్ల త్రాచులాంటి ఒక సన్నని రోడ్డు - ఆ పొలాలపై మంచు తెరలాగ పరుచుకుని ఏక్కడో కొడి కొక్కొరకో అని అరుస్తుంటె ఆ అనుభవం - సంధ్యవేళ పక్షుల కిలకిలరవాలమధ్య భానుడు వీడ్కొలు చెప్పుతూ చందమామకు స్వాగతం తెలుపుతున్నప్పుడు ఆ ప్రకృతి దృశ్యాలు' లాంటి వాక్యాలు చాలా బాగున్నాయి. ఇలాంటివి మరిన్ని మంచి పోస్టులు మీరు రాస్తూ వుండాలని నా ఆకాంక్ష.

నా కథలు...... said...

వెంకి గారు మీకు ధన్యవాదములు నన్ను ఇలాగే ప్రొత్షహిస్తారని అనుకుంటున్నాను.

నా కథలు...... said...

రాజారావు గారు మీరు చెప్పింది అక్షర సత్యం.మీరు చెప్పినట్లు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి.తప్పదు.