ఈ మధ్య ఏక్కడ చూసిన హ్యాపీ డేస్ ఫివర్ పట్టుకుంది జనాలకి.ఏవ్వడ్ని చూసినా,కలిసినా ఇదే టాపిక్.ఎరా హ్యాపీ డేస్ సినిమా చూసావా అని.చూడలేదంటే ఇంకా చూడలేదా అని యక్ష ప్రస్నలతో మనల్ని వేధిస్తున్నరు.మనమేదో పెద్ద తప్పు చెసినట్టు మాట్లడుతున్నారు.వై.యస్ ఇందిరమ్మ,రాజీవ్ ల జపం చేసినట్టు ఇప్పుడందరూ హ్యపీ డేస్ జపం చేస్తున్నారు.ఎవడిని కదిపినా ఇదే ప్రస్న.ఇంకా చూడలేదంటే ఇప్పటి దాక ఏమి చెస్తున్నావ్ అని తిరిగి ప్రస్నిస్తున్నరు.అదేదో నేను జీవితంలో పెద్ద తప్పు చేసి అన్ని కొల్పొయినవాడిని చూస్తున్నట్టు చూస్తున్నారు.ఇన్ని బాధల మధ్య పొయిన ఆదివారం మధ్యాహ్నం చూసి వచ్చాను.
చాలా బాగుంది సినిమా.ఆచ్చు మన విద్యార్థి జీవితాన్ని ప్రతిబింబించేలాగుంది సినిమా.ప్రతి పాత్ర మనల్ని మనం చూసుకుంటున్నట్టుగా ఉంది.అందులో నాలుగు పత్రల్లో మనం మన ఫ్రండ్స్ ఉన్నట్టుగా ఫీల్ ఐయ్యి బగా ఇన్వొల్వెమెంట్ తొ చూడ దగ్గ సినిమా.ఆ సినిమా చూసాక నాకప్పుడు అర్ధమైంది అందరు ఎందుకు అడుగుతున్నారా అని.మంచి యూత్ సినిమా.ఆ సినిమా డైరక్టరైన శేఖర్ కమ్ముల గారికి నా ధన్యవాదములు.
మనస్సుకు హత్తుకునే సినిమా.చాల మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ ఒక పక్క చివరిలో అంత మంచి ప్రాణ స్నేహితులను విడదీసారనే బాధ ఒక పక్క.చాణ్ణాళ్ళకు ఒక మంచి సినిమా వచ్చింది.ఇక కధ విషయానికి వస్తే నాకు బాగా నచ్చిన పాత్ర రజెష్ ది,టైసన్ ది.కాని టైసన్‌ని శ్రవంతి తొ కలపనందుకు చాల బాధేసింది.ఇది ఎవడి స్టుడెంట్ లైఫ్ లొ వాళ్ళకి జరిగిన కథే.ఇలాంటి కథ మాకు జరిగింది.కాని మా కథలో అప్పు,మధు లేరు.అదొక్కటే లోటు మాకు.సీనియర్స్ ర్యాగింగ్ కూడ లేదనుకోండి.
మా కాలేజి పల్లెటూరిలో ఉండడం వలన మాకు అప్పూ,మధు దొరకలేదు దొరికే లొపల కొంతమంది(2) వెధవల వల్ల మొదటికే మోసం వచ్చింది.కాని వాళ్ళు లేకపొయినా బగానే ఆనదించామనుకోండి.కాని ఆ దుర్మర్గులను(2) మాత్రం జీవితంలొ మరచిపోము.ఆలాంటి దుర్మార్గులు ప్రతి కలేజిలోనూ ఉంటారు.అలాంటి వారితొ చాలా జాగ్రత్తగా మసలుకోవాలి లేకపోతే మన రహస్యాలన్నీ ఎవరికి ఎప్పుడు చేరాలో అప్పుడు చేరిపోతాయి తరువాత రాజేష్ లా ఎంత కాళ్ళు పట్టుకున్న ప్రయోజనం ఉండదు ఎందుకంటే అందారూ అప్పూలాగుండరుకదా.
ఈ సినిమా ఇంకా చూడని వారుంటే తొందరగా చూడవలసినదిగా మనవి.లేకపోతే మీరు కూడ నా లాగే బాధపడతారు.నేను మళ్ళా ప్రణాలిక వేస్తున్నను ఈ సినిమా కొసం.కాని టికెట్ దొరకడం లేదు.ఏమి జరుగుద్దో చూడాలి.
Tuesday, October 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
Kekaaaaaaaaaaaaaa pettinchav
super movie.
hahha, nenu kuda andarini tega visiginchestunnanu ee cinema chudamani.
రాధిక గారు మీ జావా బ్లాగు చూసాను చాలా బాగుంది.నాకు బగా ఉపయోగ పదుతుంది.
Wow mee blog lo vishayalu asaktikaramgaa vunnayi.
ilagae raastu vundandi.
విహారి గారు మీ నుంచి కామెంట్ వచ్చినందుకు నేను చాల అనందపడుతున్నాను.ధన్యవాదములు.కాని మీ అంత గొప్పగా రాయలేదనుకోనుకోండి ఏదొ నా వంతు ప్రయత్నిస్తున్నాను.
Post a Comment